తెలంగాణ

telangana

ETV Bharat / state

Ganesh Shobhayatra: నిజామాబాద్​లో ఘనంగా శోభాయాత్ర... నిమజ్జనానికి తరలిన గణనాథులు - Telangana news

నిజామాబాద్ జిల్లాలో నవరాత్రులు పూజలు అందుకున్న గణపయ్యలు నిమజ్జనానికి తరలారు. భక్తులు శోభాయాత్ర నిర్వహిస్తూ ముందుకు కదులుతున్నారు. వినాయక విగ్రహాల ముందు స్టెప్పులు వేస్తూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

Ganesh shobha
నిమజ్జనానికి తరలిన గణనాథులు

By

Published : Sep 19, 2021, 4:49 PM IST

నిజామాబాద్ జిల్లాలో గణేశ్​ శోభాయాత్ర (Ganesh Shobhayatra) కొనసాగుతోంది. నగరంలోని దుబ్బ సార్వజనిక్ గణేశ్​ మండలి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. రథానికి ఎడ్లను కట్టి ఆ రథంపై వినాయకుడిని ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. ఈ గణేశుడిని మిగతా బొజ్జ గణపయ్య విగ్రహాలు అనుసరిస్తున్నాయి.

రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్, కలెక్టర్ నారాయణరెడ్డి, జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు శోభాయాత్రలో పాల్గొన్నారు. చిన్న విగ్రహాలను వినాయక్ నగర్ వినాయకుల బావిలో... పెద్ద విగ్రహాలను బాసర వద్ద గోదావరిలో నిమజ్జనం చేస్తున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 8 వేల గణనాథులు నిమజ్జనం అవుతాయని వెల్లడించారు.

ఇదీ చదవండి :Traffic Restrictions : హైదరాబాద్​లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ రోడ్లు క్లోస్ చేశారు? ఏఏ దారులు మళ్లించారు?

ABOUT THE AUTHOR

...view details