రాష్ట్రంలో రేపటి నుంచి లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వ ప్రకటించడంతో మద్యం ప్రియులు దుకాణాల ముందు బారులు తీరారు. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా వైన్‌షాపుల వద్దకు భారీగా తరలి వచ్చారు. నిర్ణయం వెలువడగానే వెంటనే దుకాణాల వద్దకు పరుగులు తీశారు.
లాక్ డౌన్ ప్రకటన.. వైన్‌షాపులకు మందుబాబుల పరుగులు - నిజామాబాద్ వార్తలు
రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటన రావడంతో మందుబాబులు అప్రమత్తమయ్యారు. వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. నిజామాబాద్‌లో పది రోజులకు సరిపడా మద్యం తీసుకుని వెళ్తున్నారు. దీంతో దుకాాణాల వద్ద భారీగా రద్దీ పెరిగింది.
వైన్‌షాపులకు మందుబాబుల పరుగులు
నిజామాబాద్‌లో మద్యం ప్రియులు పది రోజులకు సరిపడా మందు కొనుక్కుని వెళ్తున్నారు. నగరంతో పాటు నియోజకవర్గ, మండలం కేంద్రాల్లోని వైన్‌షాపుల వద్ద రద్దీ పెరిగింది. కామారెడ్డి జిల్లాలోనూ అన్ని ప్రాంతాల్లో ఇవే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి.