తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు నిజామాబాద్‌లో ఘనంగా జరిగాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా సర్పంచ్ల ఫోరమ్ ఆధ్వర్యంలో సర్పంచ్ల కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. హెల్త్ క్యాంప్‌ను జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు ప్రారంభించారు.
కవిత పుట్టినరోజు వేడుకలు: నిజామాబాద్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం
ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా సర్పంచ్ల కుటుంబీకులకు ఈ శిబిరం ద్వారా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
కవిత పుట్టినరోజు వేడుకలు
తమ నాయకురాలు కవిత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలను భగవంతుడిని కోరుకున్నట్లు జడ్పీ ఛైర్మన్ తెలిపారు. రాష్ట్ర సంస్కృతిని కవిత అంతర్జాతీయస్థాయిలో చాటిచెప్పారని.. బతుకమ్మ ప్రత్యేకతను, బోనాల విశిష్టతను అందరూ గుర్తించేలా కృషిచేశారని విఠల్‌రావు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్, జిల్లా సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: హ్యాపీ బర్త్‌డే కవితక్క.. వినూత్నంగా శుభాకాంక్షల వెల్లువ