నిజమాబాద్ జిల్లా బోధన్ నర్సిరోడ్ పక్కన పెట్రోల్ బంక్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో పెట్రోల్ బంక్‌లోకి దొంగలు చోరబడి కత్తులతో బెదిరించి రాళ్లతో దాడిచేసి క్యాష్ కౌంటర్‌ను ఎత్తుకెళ్లారు.
బోధన్ పట్టణంకు కూతవేటు దూరంలో ఉండే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో నలుగురు దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ముగ్గురు క్యాష్ కౌంటర్‌ను ఎత్తుకెళ్లగా.. ఒకరు ఆఫీస్ రూంలోకి చొరబడి డబ్బులు తీసుకుని పారిపోయారు.