నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లేడి గ్రామానికి చెందిన 30 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు 70 సంవత్సరాల నుంచి 50 ఎకరాల భూమిని సేద్యం చేస్తూ.. జీవనం కొనసాగిస్తున్నారు. వ్యవసాయం చేసుకుంటున్న భూమి అటవీశాఖకు సంబంధించిందని అడవి శాఖ అధికారులు తమపై కేసులు పెడతామని బెదిరిస్తూ.. వ్యవసాయం చేయకుండా అడ్డుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు తమకే దక్కాలంటూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించి బాధను వెల్లడించారు.
మా భూములు మాకే కావాలి: కలెక్టర్కు వినతి
నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజావాణిలో తమ భూములు తమకే దక్కాలంటూ 30 ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారు కలెక్టర్కు వినతిపత్రం అందించారు.
ప్రజావాణిలో 30 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు కలెక్టర్కు వినతి పత్రం