తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్కారే కొనాలే....! - ARMUR

''ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే కనీనం పెట్టుబడిలో సగం కూడా వస్తలేదు. ప్రైవేటోళ్లేమో దోచుకుంటున్నరు''. ఇది పసుపు, ఎర్రజొన్న రైతుల ఆవేదన.

మద్ధతు ధర ప్రకటించాలని ఆర్మూర్​లో రైతుల ధర్నా

By

Published : Feb 7, 2019, 2:59 PM IST

మద్ధతు ధర ప్రకటించాలని ఆర్మూర్​లో రైతుల ధర్నా
నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లోని మామిడిపల్లి కూడలిలో రైతులు ఆందోళనకు దిగారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పంటలను ఆహార పంటలుగా గుర్తించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు.
ధర్నాలో పాల్గొనేందుకు వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున వచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details