ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం: రైతులు - formers
వారణాసి అధికారుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని నిజామాబాద్ రైతులు తెలిపారు. నామినేషన్ వేయకుండా అనేక ఇబ్బందులు సృష్టించారని ఆర్మూర్లో అన్నదాతలు చెప్పారు.
రైతులు
ఆర్మూర్ నుంచి 50 మంది అన్నదాతలు తమ సమస్య జాతీయ స్థాయిలో వినిపించేందుకు వారణాసి వెళ్లారని రైతు సంఘం నాయకుల చెప్పారు. ప్రధాని మోడీ పై నామినేషన్ వేయడానికి వెళ్తే పై అధికారులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ఢిల్లీ వెళ్లి అధికారుల తీరుపై ఫిర్యాదు చేసి... అదే రోజు పసుపు బోర్డు, మద్దతు ధర కల్పనకై ప్రధానికి బహిరంగ లేఖ విడుదల చేస్తామన్నారు.