నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి దుబ్బ రోడ్డు వరుకు డివైడర్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. పట్టణంలోని అంతర్గత రోడ్ల నిర్మాణం సంపూర్ణంగా పూర్తి చేసిన ఘనత కేవలం తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. నగరానికి నలువైపుల నుంచి వచ్చే ప్రధాన రహదారుల రోడ్డు విస్తరణ పనులను డివైడర్ నిర్మాణ పనులను చేపట్టామన్నారు.
డివైడర్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ - డివైడర్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

డివైడర్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ