నిజామాబాద్ జిల్లా బాల్కొండలో తహసీల్దార్ అర్చన, ఎంపీడీవో సంతోష్ కుమార్‌లు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. లాక్డౌన్తో పనులు లభించక పేదలు, వలస కూలీలు ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి వారికి సాయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
లాక్‌డౌన్ ముగిసే వరకు పేదలకు భోజన వసతి - food facility for needy in balkonda till lock down is over
లాక్‌డౌన్ వల్ల ఎవరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా బాల్కొండలో తహసీల్దార్ అర్చన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. లాక్‌డౌన్ ముగిసే వరకు దాతల సాయంతో ఈ కార్యక్రమం కొనసాగించనున్నట్లు నిర్వాహకులు మండల విద్యాధికారి తెలిపారు.

బాల్కొండలో పేదలకు భోజన వసతి
స్పందించిన మండల విద్యాధికారి, ఇద్దరు ఉపాధ్యాయుల సాయంతో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో లాక్‌డౌన్ ముగిసే వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తామని విద్యాధికారి తెలిపారు.