రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికులను ఆదుకునేందుకు బియ్యం, నిత్యావసరాలు, డబ్బులు పంపిణీ చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం పుట్టిన గడ్డ మీద మమకారంతోనో... అక్కడికి వెళ్లాలనే ఆశతోనో స్వస్థలాలకు వెళ్తున్నారు. వసతులు లేకున్నా కాలినడకన తమ స్వస్థలాలకు బయలుదేరారు. దారిలో ఎవరో ఒకరు ఆపి భోజనం పెడితే తింటున్నారు. లేకపోతే ఆకలితోనే పయనం సాగిస్తున్నారు.
కాలినడకన పయనం... అన్నం పెడుతున్న ఆపన్నహస్తం - ఆహార పంపిణీ
లాక్డౌన్ కారణంగా వలస కూలీలు అవస్థలు పడుతున్నారు. సొంత గడ్డకు వెళ్లాలనే ఆశతో వందల కిలోమీటర్ల దూరాలు నడిచి వెళ్తున్నారు. వారికి తోచినంత సాయం చేసేందుకు కొంత మంది దాతలు ముందుకొచ్చి వారికి ఆహారాన్ని అందిస్తున్నారు.

కాలినడకన పయనం... అన్నం పెడుతున్న ఆపన్నహస్తం
వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ వలస కార్మికులకు ఆహారం అందించింది. జాతీయ రహదారిపై కాలినడకన వెళ్తున్న వారికి ఫ్రూటీలు, బిస్కెట్ ప్యాకెట్లు, మంచినీళ్లు అందించారు.
ఇవీ చూడండి:మే 7 తర్వాత కరీంనగర్ కరోనా ఫ్రీ జోన్ : మంత్రి గంగుల