తెలంగాణ

telangana

By

Published : Sep 16, 2020, 8:55 AM IST

ETV Bharat / state

శ్రీరాం సాగర్​కు వరద పోటు.. 40 గేట్లు ఎత్తి నీరు విడుదల

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.

Flood to sriram sagar project 40 gates raised at nizamabad
సాగర్​కు వరద.. 40 గేట్లు ఎత్తవేత

సాగర్​కు వరద.. 40 గేట్లు ఎత్తవేత

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. అధికారులు ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టులోకి ఇన్​ఫ్లో 2,21,013 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,21,013 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటి మట్టం 1,091అడుగులకు చేరి పూర్తి స్థాయిలో నిండింది. నిల్వ నీటి సామర్థ్యం 90.31 టీఎంసీలకు చేరుకుంది.

ఇదీ చూడండి :గోదావరి -కావేరి అనుసంధానంపై రాష్ట్రాలతో 18న కేంద్రం చర్చ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details