తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎగువ ప్రాంతాల నుంచి వరద... ఎస్సారెస్పీ 8 గేట్లు ఎత్తివేత - Sriram sagar project gates lifted

ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడం వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 36, 943 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.

ఎగువ ప్రాంతాల నుంచి వరద... ఎస్సారెస్పీ 8 గేట్లు ఎత్తివేత
ఎగువ ప్రాంతాల నుంచి వరద... ఎస్సారెస్పీ 8 గేట్లు ఎత్తివేత

By

Published : Oct 12, 2020, 9:38 AM IST

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్​కు వరద పోటెత్తుతోంది. అధికారులు జలాశయం​లోని ​ 8 గేట్లు ఎత్తి 25,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు.

ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 36,943 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగుల మేర నీటిమట్టం ఉంది. కాకతీయ కాల్వ ద్వారా 3,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 7,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇదీ చూడండి:సబ్‌ రిజిస్ట్రార్‌, రెవెన్యూ కార్యాలయాలకు నెట్‌వర్క్‌ అనుసంధానం వేగవంతం

ABOUT THE AUTHOR

...view details