శ్రీరాంసాగర్ జలాశయం నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీనితో గేట్ల ద్వారా గోదావరి నదిలోకి నీటిని విడుదల చేశారు. దీనితో గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఎస్సారెస్పీ జలాశయంలోకి భారీగా వరద నీరు రావడం వల్ల నాలుగు గేట్ల ద్వారా 12 వేల 500 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు అధికారులు విడుదల చేశారు.
శ్రీరాంసాగర్ జలాశయానికి వరద ప్రవాహం గోదావరి పరీవాహక గ్రామలైన సోన్, కూచన్‌పల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి నదిలోకి పశువులు మేపడానికి గానీ.. స్నానం చేయడానికి వెళ్లవద్దని సూచించారు. ముఖ్యంగా గోదావరికి పూజకు వచ్చే భక్తులు నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఇదీ చదవండి:సీఎం కాన్ఫరెన్స్‌కు ఆహ్వానించారు.. అంతలోనే రావద్దన్నారు!