SRSP gates lifted : ఎడతెరపిలేని వర్షాలతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి ప్రాజెక్టకు 2,45,500 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 34గేట్లు ఎత్తి 2,17,850 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
ఎస్సారెస్పీ 34 గేట్లు ఎత్తి నీటి విడుదల - SRSP gates lifted
SRSP gates lifted : గత నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. అధికారులు 34గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు దిగువనున్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుకాగా.. ప్రస్తుతం 1087.40 అడుగులకు చేరింది. ఎస్సారెస్పీ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90.30 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 74.50 టీఎంసీలుగా ఉంది. భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.