తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీరాంసాగర్​కు పెరిగిన వరద.. దిగువకు కొనసాగుతున్న నీటి విడుదల - నిజామాబాద్ జిల్లా వార్తలు

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. బుధవారం 50 వేల క్యూసెక్కులకు తగ్గిన వరద గురువారం లక్ష క్యూసెక్కులకు చేరింది.

శ్రీరాంసాగర్​కు పెరిగిన వరద.. దిగువకు కొనసాగుతున్న నీటి విడుదల
శ్రీరాంసాగర్​కు పెరిగిన వరద.. దిగువకు కొనసాగుతున్న నీటి విడుదల

By

Published : Sep 17, 2020, 8:23 PM IST

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. బుధవారం 50 వేల క్యూసెక్కులకు తగ్గిన వరద గురువారం లక్ష క్యూసెక్కులకు పెరిగింది. దీంతో జలాశయం 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

ఇన్​ఫ్లో లక్ష క్యూసెక్కులు కాగా ఔట్​ఫ్లో లక్ష క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1091 అడుగుల మేర నీరు ఉంది. జలాశయంలో పూర్తిస్థాయిలో అంటే 90.31 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

ABOUT THE AUTHOR

...view details