నిజామాబాద్ జిల్లా శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా నీటి విడుదల నిలిపివేయడంతో మత్స్యకారుల పంట పండుతోంది. కాల్వలో దిగి జోరుగా చేపల వేట సాగిస్తున్నారు. టన్నుల కొద్దీ చేపలు వలలకు చిక్కడంతో పట్టిన చేపలను వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు బాల్కొండ ఉమ్మడి మండలం నుంచి కోల్‌కతా, నాగ్‌పూర్, హైదరాబాద్ తదితర పట్టణాల్లోని మార్కెట్లకి తరలిస్తున్నారు.
శ్రీరాం సాగర్ నుంచి వరద కాల్వకు గురువారం నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. దీంతో బాల్కొండ, ముప్కాల్, మెండోరా, వేల్పూర్, భీమ్‌గల్, కమ్మర్‌పల్లి, నందిపేట తదితర మండలాల నుంచి పెద్ద సంఖ్యలో మత్స్యకారులు అక్కడికి తరలి వచ్చారు.