హరితహారం మొక్క తిన్న మేక యజమానికి జరిమానా - హరితహారం మొక్క తిన్న మేక
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో... హరితహారం మొక్క తిన్న మేక యజమానికి పురపాలక అధికారులు జరిమానా విధించారు. మరల ఇలా జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.
![హరితహారం మొక్క తిన్న మేక యజమానికి జరిమానా fine to goat in nizamabad for eating harithaharam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8321731-667-8321731-1596726911449.jpg)
హరితహారం మొక్క తిన్న మేక యజమానికి జరిమానా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం మొక్కలను తిన్నందుకు మేక యజమానికి అపరాద రుసుం విధించిన ఘటన... నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జరిగింది. అనిసానగర్ ప్రాంతంలో డివైడర్లపై నాటిన మొక్కలను మేక తిన్నదని దాని యజమాని అయిన ఈషా ఖాన్‌కు మున్సిపల్ కమిషనర్ రామలింగానికి రూ. 500 జరిమానా విధించారు. మరల మేకలు తినకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు.