నిజామాబాద్ జిల్లాలో వరి సన్నరకం ఏపుగా పెరగడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం ప్రోత్సహించడం వల్ల కర్షకులు సన్నరకం వరి సాగు చేశారు. అధిక శాతం పొలాల్లో వరి పంట విపరీతంగా పెరుగుతోంది.
ఏపుగా పెరుగుతున్న వరిపైరు.. ఆందోళనలో రైతన్నలు - Fine rice growth is abnormal in nizamabad district
సన్నరకం వరి ఏపుగా పెరగడం నిజామాబాద్ జిల్లా రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. సాధారణంగా రెండు అడుగుల మేర పెరగాల్సిన వరిపైరు నాలుగు అడుగుల వరకు పెరగడం వల్ల సగం వరకు పైరును కోసేస్తున్నారు.
నిజామాబాద్లో ఏపుగా పెరుగుతున్న సన్నరకం
సాధారణంగా రెండు అడుగుల మేర పెరగాల్సిన పైరు నాలుగు అడుగుల వరకు పెరిగింది. నందిపేట మండలం బజార్ కొత్తూర్ రైతులు ఎత్తు పెరగకుండా ఉండేందుకు సగం వరకు పైరును కోసేస్తున్నారు.
- ఇదీ చూడండి:హైదరాబాద్లో 6.6 లక్షల మందికి కరోనా!