నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మగ్గిడి ప్రభుత్వ పాఠశాలను సినీ నిర్మాత దిల్ రాజు సందర్శించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించారు.
విద్యార్థులతో నిర్మాత దిల్‌రాజు సందడి
చిన్నవయస్సులోనే పౌష్టికాహారం పిల్లలకు అందించడం వల్ల ఆలోచనాశక్తి పెంపొందుతుందని సినీ నిర్మాత దిల్‌రాజు అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మగ్గిడిలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.
విద్యార్థులతో నిర్మాత దిల్‌రాజు సందడి
కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు దిల్‌రాజు సూచించారు. తమ అభిమాన కథానాయిక అనుపమ పరమేశ్వరన్ అని ఓ విద్యార్థిని చెప్పగా... అనుపమకు ఫోన్‌చేసి మాట్లాడించారు. అనంతరం ఆర్మూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభానికి హాజరయ్యారు.
- ఇదీ చూడండి : సినిమా రంగం హృదయాన్ని కోల్పోతోంది: గొల్లపూడి