Father killed his daughter at Nizamabad on Extramarital affairs : అమ్మ అంటే అప్యాయత నాన్న అంటే నమ్మకం ఆ ఇరువురు కలిసి ఉంటేనే పిల్లల ఆలనపాలన.. వారి బాధ్యతను వారు మరచి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు బతికితే కొన్ని కుటుంబాల్లో తప్పవు విషాదాలు. భార్యపై కోపంతో పిల్లలను దూరంగా పెట్టడం.. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆ కోపం పిల్లలపై చూపితే ఇక్కడ నష్టపోయింది ఎవరు..? భర్త లేదా భార్య..! లేదా ఏ పాపం తెలియని పసి హృదయాలా..! నిజామాబాద్‌లో జరిగిన ఈ ఘటనలో మాత్రం ఏ పాపం తెలియని పసి హృదయం ఆగ్నికి ఆహుతైంది. ఇక్కడ నిందితుడు ఎవరో కాదు చిన్నప్పటి నుంచి కంటికి రెప్పల కనిపెంచిన తండ్రే కావడం మరింత కలచి వేస్తోంది.
ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్‌రావు తెలిపిన వివరాలు ప్రకారం.. నిర్మల్ జిల్లా ధనికి గ్రామానికి చెందిన పోశాని, కామారెడ్డికి చెందిన కాశీరాం భార్యభర్తలు. గ్రామాల్లో ప్లాస్టిక్ కాగితాలు, ఇనుప వస్తువులు అమ్ముకుని వీరు జీవనం సాగించే వారు. వీరికి తొమ్మిది, పదేళ్ల వయస్సు గల సమ్మక్క, సారక్క అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గత కొంత కాలంగా తరచూ గొడవలు జరిగేవి. దీంతో కొద్ది రోజులు క్రితం నుంచి ఇరువురు ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారు.