నిజామాబాద్ జిల్లా భీంగల్ వ్యవసాయ కార్యాలయం వద్ద జీలుగ విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. ఉదయం 5 గంటల నుంచే విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నారు. సుమారు 650 బస్తాల జీలుగ విత్తనాల కోసం.. మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఒకేసారి రావడంతో అధికారులు టోకెన్లు ఇచ్చారు.
జీలుగ విత్తనాల కోసం అన్నదాతల పడిగాపులు!
నిజామాబాద్ జిల్లా భీంగల్లో జీలుగ విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచే వ్యవసాయ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. సుమారు 650 బస్తాల విత్తనాల కోసం మండలంలోని అన్ని గ్రామాల అన్నదాతలు కార్యాలయం వద్ద టోకెన్లతో క్యూ కట్టారు.
జీలుగ విత్తనాల కోసం బారులు
అనంతరం సొసైటీ వద్ద కొవిడ్ నిబంధనలు పట్టించుకోకుండా లైన్లలో నిల్చున్నారు. ఈ సందర్భంగా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయలేదని రైతులు ఆరోపించారు. గ్రామాల వారీగా విత్తనాలు పంపిణీ చేస్తే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: రెట్టింపు ధరలతో సంచార రైతుబజార్‌లలో అడ్డగోలు దోపిడీ..!