ఆశల పంట.. అకాల వర్షంతో కన్నీరే కంట - అకాల వర్షాలు
రైతులు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట చేతికొచ్చిన సమయంలో ప్రకృతి పగబడుతోంది. అకాల వర్షాలతో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు.

old nizamabad district latest news
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోవడం వల్ల తరచూ ఆరబెట్టడం, నీరు తొలగించడం వంటి సమస్యలతో కర్షకులు సతమతమవుతున్నారు. లాక్‌డౌన్‌తో వలస కూలీలు దొరకక మరోవైపు కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. దీంతో ధాన్యాన్ని రహదారులు, మైదానాల్లో ఆరబెడుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో గురువారం రాత్రి కురిసిన వానకు తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టారు.