నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. స్టాక్ వచ్చిందంటే చాలు పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. బాల్కొండలో ఆదివారం యూరియా కోసం పెద్ద ఎత్తున బారులు తీరారు.
యూరియా కోసం రైతుల కష్టాలు - urea shartage in nizamabad
గతేడాది లాగానే ఈ ఏడాది యూరియా కోసం రైతులు కష్టాలు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. యూరియా కోసం అన్నదాతలు బారులు తీరారు.
యూరియా కోసం రైతుల కష్టాలు
వరి, తదితర పంటలకు యూరియా వేసే సమయంలో తమ వద్ద లేక పోవడం వల్ల రైతులు ఇబ్బందికి గురవుతున్నారు. బాల్కొండ సొసైటీలో ఒక్క లారీలో 450 బస్తాల లోడ్ రాగా రైతులు వందల సంఖ్యలో సొసైటీ ముందు క్యూ కట్టారు. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. అయితే చాలా మంది అన్నదాతలకు యూరియా లభించలేదు.
ఇదీ చదవండి: పెంపుడు జంతువుల కోసం మొబైల్ సెలూన్లు!