తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల మహా ధర్నాని విజయవంతం చేయాలి: అన్వేష్​ రెడ్డి - నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో రైతుల మహా ధర్నా

నవంబర్​​ 4 న మామిడిపల్లి చౌరస్తాలో రైతుల మహా ధర్నాను విజయవంతం చేయాలని కిసాన్​ కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్​ రెడ్డి సూచించారు. రైతులు పండించిన పంటలకి ప్రభుత్వం తక్కువ మద్దతు ధర కల్పించి వారిని నట్టేట ముంచుతోందని నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో మండిపడ్డారు.

farmers mega dharna on november 4th in nizamabad district
రైతుల మహా ధర్నాని విజయవంతం చేయాలి: అన్వేష్​ రెడ్డి

By

Published : Oct 31, 2020, 6:57 PM IST

నవంబర్​ 4న నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి చౌరస్తాలో నిర్వహించే రైతుల మహా ధర్నాను విజయవంతం చేయాలని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆర్మూర్​లోని పర్యవేక్షణ భవన్​లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

ప్రభుత్వ సూచన మేరకే రైతులు సన్నరకం వరి పంట వేశారని, దానికి మద్దతు ధరగా రూ. 1830 ఇవ్వడం దారుణమని అన్వేష్​ రెడ్డి ఆరోపించారు. క్వింటాలుకు రూ. 2500 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మొక్కజొన్న పంటను ఎవరు కొనరని ముఖ్యమంత్రి అనడంతో వ్యాపారులు రూ. 1150 కి కొనుగోలు చేశారని, ఇప్పుడు మక్క రైతులకి కూడా అదనంగా రూ. 500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అన్నదాతలను ప్రభుత్వం నట్టేట ముంచుతోందని అన్వేష్​ రెడ్డి మండిపడ్డారు. 4 న చేపట్టే ధర్నాను రైతులు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:దుబ్బాక ఉపఎన్నికలో వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్‌ బ్యాలెట్‌

ABOUT THE AUTHOR

...view details