తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతుల ఆందోళన - ధాన్యం కొనుగొలు కేంద్రాలు

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో రైతులు రాస్తారోకో చేశారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Farmers protest
రైతుల ఆందోళన

By

Published : Apr 14, 2021, 4:43 PM IST

కేంద్రాలు ఏర్పాటైనా.. ధాన్యం కొనుగొలు చేయడం లేదంటూ రైతులు రోడ్డెక్కారు. అధికారులు.. ధాన్యం తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ నిరసన చేపట్టారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గం గ్రామంలో ఇది జరిగింది.

గ్రామంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటై ఉన్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. మారుతోన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రైతులను అక్కడినుంచి పంపివేశారు.

ఇదీ చదవండి:మాకొద్దీ...వయసు పెంపు: ఆర్టీసీ ఉద్యోగులు

ABOUT THE AUTHOR

...view details