నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నపల్లిలో సన్నారకం వరిలో దోమపోటుతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఈర లక్ష్మీనారాయణ ఎకరం వరి పంటకు నిప్పుపెట్టి కాల్చాడు. పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితంగా లేకుండా పోయిందని వాపోయారు. ఈర లక్ష్మీనారాయణ లాక్డౌన్ సమయంలో ఖతార్ నుంచి కూతురు పెళ్లి కోసం స్వగ్రామం వచ్చాడు. పెళ్లి తర్వాత అక్కడికి వెళ్లే మార్గం లేక తనకున్న 2.5ఎకరాల్లో ప్రభుత్వ సూచనతో సన్నాలు సాగు చేశారు.
సిర్నపల్లిలో ఎకరం వరి పంటకు నిప్పు పెట్టిన రైతు - ఎకరం వరి పంటను కాల్చిన రైతు
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నపల్లిలో ఈర లక్ష్మీనారాయణ అనే రైతు ఎకరం విస్తీర్ణంలోని వరి పంటకు నిప్పు పెట్టారు. దోమకాటు వచ్చి పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పంట బాగోస్తుందని అనుకునే లోపు దోమ దాడి చేసింది. దాదాపు రూ.20వేలు వెచ్చించి మూడు దఫాలుగా పురుగు మందులు పిచికారీ చేశారు. అయిన కట్టడి కాలేదు. అంతే కాకుండా 1.5ఎకరాలు నూర్పిడి చేస్తే 15బస్తాల నాసిరకం ధాన్యం వచ్చిందని... దీని కోసం మూడున్నర గంటలు సమయం పట్టిందని, ఒక్కో గంటకు రూ.1800 చొప్పున రూ.6300 ఖర్చైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత చేస్తే ధాన్యంలో తేమ లేదని, బియ్యం రావడం లేదని కొనుగోలు కేంద్రంలో తూకం వేయడం లేదని పేర్కొన్నారు. అప్పుల్లో ఉన్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ వేడుకున్నారు.
ఇదీ చూడండి:డీజీపీని కలిసిన కాంగ్రెస్ నేతలు... దుష్ప్రచారంపై ఫిర్యాదు