తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో సురవరం ప్రతాపరెడ్డి వర్ధంతి కార్యక్రమం - తెలంగాణ తాజా వార్తలు

తెలంగాణ కవులు, రచయితల ఆత్మగౌరవానికి సురవరం ప్రతాపరెడ్డి నిలువెత్తు నిదర్శనమని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. సురవరం వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని ట్రెండీ క్రియేషన్స్​లో నిర్వహించిన సుమాంజలి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

నిజామాబాద్​లో సురవరం ప్రతాపరెడ్డి వర్ధంతి వేడుకలు
నిజామాబాద్​లో సురవరం ప్రతాపరెడ్డి వర్ధంతి వేడుకలు

By

Published : Aug 25, 2020, 10:43 PM IST

నిజామాబాద్​ నగరంలోని ట్రెండీ క్రియేషన్స్​లో ప్రముఖ రచయిత సురవరం ప్రతాపరెడ్డి వర్ధంతి సందర్భంగా సుమాంజలి కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్​ పాల్గొని సురవరం రచనలను గుర్తు చేసుకున్నారు.

ఆయన సారథ్యంలో వచ్చిన గోలకొండ కవుల సంచిక తెలంగాణలో... కవులు, సాహిత్యము లేదన్న మాటలకు సమాధానంగా నిలిచిందని పేర్కొన్నారు. సురవరం రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర తెలుగు సాహిత్యంలోనే మకుటాయమానమైన రచన అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేవీ రమణాచారి, లక్ష్మీ నరసయ్య చారి, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details