తెలంగాణ

telangana

ETV Bharat / state

'మాతో బాగానే ఉండేవారు.. కానీ వాళ్లకు ఇన్ని అప్పులున్నాయని తెలియదు' - family suicide by debts

అప్పుల బాధ తాళలేక నిజామాబాద్​కు చెందిన పప్పుల సురేశ్​ కుటుంబం.. ఏపీలోని విజయవాడలో సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. వారికి ఒకటి, రెండు కాదు ఏకంగా రూ. నాలుగన్నర కోట్ల అప్పులు ఉన్నట్లుగా సమాచారం. నిజామాబాద్​లోని ఓ అపార్ట్​మెంట్​లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్న పప్పుల సురేశ్..​ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడటం అపార్ట్​మెంట్​ వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వారంతా తమతో కలివిడిగానే ఉండేవారని.. కానీ వాళ్లకు ఇన్ని అప్పులున్నాయని తెలియదని చెబుతున్నారు.

nizamabad family suicide in vijayawada
విజయవాడలో తెలంగాణ కుటుంబం ఆత్మహత్య

By

Published : Jan 8, 2022, 1:29 PM IST

అపార్ట్​మెంట్​ వాసులతో ముఖాముఖి

ఎనిమిదేళ్లుగా పప్పుల సురేశ్​ కుటుంబం ఇదే అపార్ట్​మెంట్​లో ఉంటోంది. వారిని చూస్తే ఉన్నత స్థితిలో ఉన్నట్లుగానే అనిపిస్తారు. స్థానికంగా బస్టాండ్​ ఎదురుగా సురేశ్​కు మెడికల్​ షాప్​ ఉంది. ఇటీవల రోడ్డు వెడల్పులో ఆ షాప్​ కూలగొట్టారు. దానికి సంబంధించి అప్పులు ఉండొచ్చు. రెండు రోజుల క్రితం ఓ సంస్థ వాళ్లు ఈ ఇంటిని సీజ్​ చేశారు. ఇటీవల చాలా మంది బాకీల వసూళ్ల కోసం ఇంటికి వచ్చారు. అప్పుడే వాళ్లకు ఇన్ని అప్పులున్నాయని మాకు తెలిసింది. బయటకు వెళ్లి వెంటనే వస్తారనుకున్నాం కానీ.. ఇలా సూసైడ్​ చేసుకుంటారని అనుకోలేదు. -- స్థానికులు, నిజామాబాద్​

ABOUT THE AUTHOR

...view details