తెలంగాణ

telangana

ETV Bharat / state

Fb Help : స్నేహితుడి కుటుంబానికి ఫేస్​బుక్ మిత్రుల సాయం - Facebook friends help to a family

ఉపాధి కోసం దుబాయి వెళ్లి అనారోగ్యంతో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి మిత్రులు అండగా నిలిచారు. ఫేస్​బుక్ ద్వారా విషయం తెలుసుకుని ఆర్థికంగా ఆ కుటుంబానికి చేయూతనిచ్చారు. అందరూ కలిసి లక్షా 21వేల రూపాయలు సేకరించి వారికి అందించారు.

nizamabad district news, facebook friends helped a family
నిజామాబాద్ జిల్లా వార్తలు, స్నేహితుడి కుటుంబానికి ఫేస్​బుక్ మిత్రుల సాయం, ఫేస్​బుక్ సాయం

By

Published : Jun 1, 2021, 9:25 AM IST

ఉపాధి కోసం దుబాయి వెళ్లి అనారోగ్యంతో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి ఫేస్ బుక్ మిత్రులు చేయూతనందించారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి రూ.లక్షా 21వేల సాయం చేశారు.

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం రామన్నపేట్ గ్రామానికి చెందిన తెడ్డు పురుషోత్తం.. గతంలో అప్పులు చేసి ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. భార్య లత కూలి పని చేస్తూ ఇద్దరు పిల్లల్ని పోషిస్తోంది. దుబాయి​లో సరైన పని దొరకకపోగా.. పురుషోత్తం పక్షవాతానికి గురయ్యాడు. కొన్ని నెలల క్రితం ఇంటికి తిరిగి వచ్చిన అతనికి కుటుంబం అప్పు చేసి మరీ వైద్యం అందించింది. రెండు కిడ్నీలు చెడిపోయి ఇటీవలే పురుషోత్తం మరణించాడు.

ఫేస్​బుక్ ద్వారా ఈ వార్త తెలుసుకున్న మృతుడి స్నేహితులు అతని కుటుంబానికి అండగా నిలవాలనుకున్నారు. మరికొందరి వద్ద విరాళాలు సేకరించి మొత్తం రూ.1.21లక్షలు ఆ కుటుంబానికి అందించారు. రూ.80వేలతో అప్పు తీర్చి.. మిగతా డబ్బును పిల్లల పేరిట ఫిక్స్​డ్ డిపాజిట్ చేయించారు.

ABOUT THE AUTHOR

...view details