నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి గ్రామ గంగపుత్రులపై గ్రామ బహిష్కరణ ఘటనలో గ్రామ అభివృద్ధి కమీటీ వెనుకకు తగ్గింది. గ్రామాభివృద్ధి కమిటీ చేస్తున్న బెదిరింపులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా... ఆర్డీవో, డీఎస్పీ, తహసీల్దార్, ఎస్సై గ్రామానికి వెళ్లి పరిశీలించారు. గ్రామ అభివృద్ధి కమిటీ సిబ్బందిని మందలించారు. గంగపుత్రులపై గ్రామ బహిష్కరణ ఎత్తివేసినట్టు గ్రామ చావిడి వద్ద మైక్ ద్వారా ప్రకటింపజేశారు.
గంగపుత్రులపై బహిష్కరణ ఎత్తివేత.. వీడీసీ సభ్యులకు హెచ్చరిక - nizamabad news
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి గ్రామ గంగపుత్రులపై వేసిన గ్రామ బహిష్కరణను ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ చర్యకు పాల్పడిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను హెచ్చరించారు. చట్టన్ని చేతిలోకి తీసుకోవద్దని అవగాహన కల్పించారు.
![గంగపుత్రులపై బహిష్కరణ ఎత్తివేత.. వీడీసీ సభ్యులకు హెచ్చరిక Exclusion waiver on pipri village fisheries](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7992453-260-7992453-1594529375567.jpg)
Exclusion waiver on pipri village fisheries
చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎలాంటి పరిమాణాలు ఉంటాయో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు అధికారులు అవగాహన కల్పించారు. ఈ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన జిల్లా గంగపుత్ర చైతన్య సమితిని పిప్రి గ్రామ మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.