నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం సుంకెట్ గ్రామంలో మాజీ పార్లమెంట్ సభ్యులు ఎం నారాయణ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు.
సుంకెట్లో మాజీ ఎంపీ నారాయణరెడ్డి విగ్రహావిష్కరణ - నిజామాబాద్ బాల్కొండ సుంకెట్ మాజీ నారాయణ రెడ్డి విగ్రహం
మాజీ ఎంపీ నారాయణ రెడ్డి విగ్రహాన్ని నిజామాబాద్ జిల్లా బాల్గొండ నియోజకవర్గం సుంకెట్ గ్రామంలో ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణలో ముఖ్య అతిథులుగా రాష్ట్రమంత్రులు ప్రశాంత్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ నారాయణ రెడ్డి విగ్రహావిష్కరణ
నారాయణ రెడ్డి అపర మేధావి అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తొలి పార్లమెంటులో అద్భుత ప్రతిభ కనబరిచి తెలంగాణకు వన్నె తెచ్చారని ఆయన పేర్కొన్నారు. నారాయణ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమూల్యమైన సలహాలు అందించేవారని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
TAGGED:
Ex MP Narayana Reddy statue