అబద్దాలతో పసుపు రైతులను మోసం చేయడం తగదని నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్ అన్నారు. పసుపు బోర్డు తెస్తానని చెప్పిన అర్వింద్.. కనీసం మద్దతు ధరనూ కల్పించలేకపోవడం దారుణమన్నారు. పసుపు పంటకు మద్దతు ధర కోసం శనివారం నాడు ఆర్మూర్‌లో ఎంపీ రేవంత్ రెడ్డి దీక్ష నేపథ్యంలో నిజామాబాద్‌లో పసుపు మార్కెట్‌ను ఆయన సందర్శించారు.
పసుపు బోర్డు అన్నారు... మద్దతు ధరే లేదు: మధుయాస్కీ - తెలంగాణ వార్తలు
నిజామాబాద్‌లోని పసుపు మార్కెట్‌ను మాజీ ఎంపీ మధుయాస్కీ సందర్శించారు. రైతులతో మాట్లాడి పసుపు పెట్టుబడి, దిగుబడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పసుపు బోర్డును తెస్తానన్న ఎంపీ అర్వింద్... మద్దతు ధర కల్పించడం లేదని ఆరోపించారు.
మార్కెట్ యార్డులో పసుపు రైతులతో మాట్లాడారు. పెట్టుబడి, దిగుబడి, ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు పసుపు రైతుల అవసరాన్ని ఎంపీ అర్వింద్.. తనకు అనుకూలంగా మార్చుకుని బోర్డు, మద్దతు ధర పేరుతో మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై నెడుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనైనా పసుపు బోర్డుపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధుయాస్కీతో పాటు టీపీసీసీ నాయకులు మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.