తెలంగాణ

telangana

ETV Bharat / state

గల్ఫ్‌ బాధితుడికి మాజీ ఎంపీ కవిత ఆపన్నహస్తం - గల్ఫ్​ బాధితుల వార్తలు

ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన నిజామాబాద్ జిల్లా వాసికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆపన్నహస్తం అందించారు. గల్ఫ్‌లో అనేక ఇబ్బందులు పడుతున్న దశరథ్‌ను.. అక్కడి అధికారులతో మాట్లాడి స్వస్థలానికి రప్పించారు.

గల్ఫ్‌ బాధితుడికి మాజీ ఎంపీ కవిత ఆపన్నహస్తం
గల్ఫ్‌ బాధితుడికి మాజీ ఎంపీ కవిత ఆపన్నహస్తం

By

Published : Jul 23, 2020, 9:48 PM IST

ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన నిజామాబాద్ జిల్లా వాసికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆపన్నహస్తం అందించారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం బాలానగర్‌కు చెందిన భూక్యా దశరథ్‌ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లారు. అయితే అక్కడ పక్షవాతం రావడం, మరోవైపు వీసా గడువు ముగిసిపోవడం, ఆర్థిక ఇబ్బందులు తోడుకావడం వల్ల ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో గల్ఫ్ లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

ఈ విషయంపై స్థానిక సర్పంచ్ నిహారిక.. రూరల్ ఎమ్మెల్యే గోవర్ధన్‌కు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి.. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత దృష్టికి తీసుకువెళ్ళారు. తర్వాత కవిత అక్కడి అధికారులతో మాట్లాడి స్వస్థలానికి రప్పించారు. జిల్లా జాగృతి నాయకులు బాధితుడిని హైదారాబాద్ నుంచి బాలానగర్‌కు తీసుకొచ్చారు. మాజీ ఎంపీ కవిత, జాగృతి నాయకులకు.. దశరథ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details