రాజ్యాంగ హక్కులతో పాటు విధులు బాధ్యతలు తెలుసుకొని ప్రతి ఒక్కరు పాటించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు అన్నారు. ప్రగతిభవన్లో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. నవంబర్ 26న ఏటా రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారులు.. ప్రజలు ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు, డీఆర్ఓ అంజయ్య, ఆయా శాఖల జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
'బాధ్యతలు ప్రతి ఒక్కరూ పాటించాలి' - Constition day in nizamabad
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారులతో జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్రావు ప్రతిజ్ఞ చేయించారు.
!['బాధ్యతలు ప్రతి ఒక్కరూ పాటించాలి' రాజ్యాంగ దినోత్సవాన్ని](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5183112-634-5183112-1574768628286.jpg)
రాజ్యాంగ దినోత్సవాన్ని