బ్లాక్ ఫంగస్ గురించి ఎవరూ ఎక్కువగా ఆందోళన చెందొద్దని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ అన్నారు. కరోనా వచ్చి కోలుకున్న ప్రతి ఒక్కరికీ బ్లాక్ ఫంగస్ సంక్రమించదని చెప్పారు. కరోనా అనంతర సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎదుర్కొనే ఇబ్బందులపై ఈటీవీ భారత్ నిర్వహించిన ఫోన్‌ఇన్‌లో ఆమె పాల్గొన్నారు.
'కరోనా నుంచి కోలుకున్నవారందరికీ బ్లాక్ ఫంగస్ సంక్రమించదు' - ఈటీవీ భారత్ ప్రత్యేక కార్యక్రమాలు
కరోనా నుంచి కోలుకున్న వారందరికీ బ్లాక్ ఫంగస్ వస్తుందని భావించడం సరికాదని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ అన్నారు. కొవిడ్ అనంతర సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎదుర్కొనే ఇబ్బందులపై ఈటీవీ భారత్ నిర్వహించిన ఫోన్‌ఇన్‌లో ఆమె పాల్గొన్నారు.
బ్లాకా ఫంగస్‌పై అవగాహనకు ఈటీవీ భారత్ ఫోన్ ఇన్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ ప్రతిమారాజ్ ఫోన్‌లో సమాధానాలిచ్చారు. బ్లాక్ ఫంగస్ గురించి ఎక్కువగా ఆందోళనచెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్నవారికి, షుగర్ నియంత్రణలో లేనివారికి బ్లాక్ ఫంగస్ వచ్చేందుకు అవకాశం ఉందన్నారు.
ఇదీ చదవండి:'బ్లాక్ ఫంగస్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. ముప్పు తక్కువ'