చిన్న పిల్లల్లో కొవిడ్ తీవ్రత స్వల్పమేనని.. అందుకు వ్యాక్సిన్లు కారణమని నిజామాబాద్‌లోని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాంచందర్ చెబుతున్నారు. పిల్లలపై కరోనా ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఏ సందర్భంలో వైరస్ తీవ్రత అధికంగా ఉంటుందన్న అంశాలపై ఈటీవీ భారత్ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
'పిల్లలపై కొవిడ్ తీవ్రత స్వల్పమే'
చిన్న పిల్లల్లో కొవిడ్ తీవ్రత స్వల్పమేనని నిజామాబాద్‌లోని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాంచందర్ తెలిపారు. అందుకు టీకాలు ఓ కారణమని చెబుతున్నారు. ఈటీవీభారత్ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో పలువురి సందేహాలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.
ఈటీవీ భారత్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాంచందర్
ప్రజల నుంచి పలు సందేహాలకు డాక్టర్ రాంచందర్ సమాధానాలు ఇచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి ప్రజలు ఫోన్ చేసి వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగారు. పిల్లలపై కరోనా తీవ్రత అంతగా ఉండదని తెలిపారు.