"Padma Shri Awardee Padmaja Reddy: కూచిపూడిలో నాకు పద్మ శ్రీ అవార్డు రావడం బాధ్యతగా భావిస్తున్నాను. ఈ కళను ఇంకా ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్నదే నా లక్ష్యం. కూచిపూడిలో ఇప్పటివరకు 700 మందికి శిక్షణ ఇచ్చాను. 3000కు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. ఆడశిశువులను చంపేసి చెత్తకుప్పల్లో పడేయడం నన్ను చాలా కదిలించింది. అందుకే భ్రూణ హత్యలపై పలు ప్రదర్శనలు ఇచ్చాను. సామాజిక స్పృహ కలిగే అంశాలపై అవగాహన కలిగించేలా నృత్య రూపకంలో చేశాను. వాటికి పలు అవార్డులు దక్కాయి. కాకతీయుల కళను ప్రపంచానికి పరిచయం చేయడంలో దాదాపు 10 సంవత్సరాలకు పైగా పలు అధ్యయనాలు చేశాను. కాకతీయుల కాలంలో శిల్పాల వస్త్రధారణపై అవగాహన పెంచుకుని ప్రపంచానికి పరిచయం చేయడంలో నా వంతు కృషి చేశాను. మన సంస్కృతిని కాపాడేందుకు పిల్లలకు తల్లిదండ్రులు నాట్యం నేర్పించాలి." -- పద్మజా రెడ్డి, పద్మ శ్రీ అవార్డు గ్రహీత
Padma Shri Awardee Padmaja Reddy: 'కాకతీయుల కళపై పదేళ్లపాటు అధ్యయనం చేశా' - etv bharat face to face with padma shri awardee padmaja reddy
Padma Shri Awardee Padmaja Reddy: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఓ కళాకారిణి పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. కూచిపూడితో కళాప్రపంచంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవటం సహా.. కాకతీయుల చరిత్రను వెలుగులోకి తెచ్చి చారిత్రక నృత్య రూపకాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆమె మరెవరో కాదు.. మన కూచిపూడి నృత్యకారిణి డాక్టర్ పద్మజారెడ్డి. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన పద్మజా రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి..
పద్మ శ్రీ పద్మజా రెడ్డి