రాష్ట్రంలో యాసంగి పంటలు జోరందుకున్న సమయంలో చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ వరి, చెరుకు పరిశోధన కేంద్రం డైరెక్టర్ డా. శ్రీధర్ రైతులకు వివరించారు. ఈ మేరకు ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో పంట యాజమాన్య పద్ధతులు, యాంత్రీకరణ ఆవశ్యకతను పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి ఆయన వివరించారు.
సాగు సమస్యలపై 'ఈటీవీ భారత్' ఫోన్‌ఇన్ - పంట సమస్యలపై ఈటీవీ భారత్ ఫోన్ ఇన్
యాసంగి పంటలను చీడ పీడలు ఆశించకుండా రైతులు తీసుకోవాల్సిన చర్యలను నిజామాబాద్ జిల్లాలోని వరి, చెరుకు పరిశోధన కేంద్రం డైరెక్టర్ డా. శ్రీధర్ రైతులకు వివరించారు. ఈ మేరకు ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.
![సాగు సమస్యలపై 'ఈటీవీ భారత్' ఫోన్‌ఇన్ etv-bharat-conduct-phone-in-program-for-farmers-in-nizamabad-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10436747-540-10436747-1612005228682.jpg)
పంట సమస్యల పరిష్కారానికి ఈటీవీ భారత్ ఫోన్ ఇన్
ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 50 మంది రైతులు ఫోన్ చేసి తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో చేపట్టిన ఫోన్ ఇన్‌కు రైతుల నుంచి మంచి స్పందన ఉందని పరిశోధన కేంద్ర అధిపతి డా.శ్రీధర్ అన్నారు. ఈ కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:అహింసతో స్వతంత్ర సంగ్రామాన్ని ఉరకలెత్తించారు : సీఎం కేసీఆర్