తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు: మంత్రి ప్రశాంత్ రెడ్డి - Minister prashanth reddy tour in velpur mandal

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. రైతుల నుంచి ఎఫ్​సీఐ 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు.

Minister prashanth reddy
వేల్పూర్​ మండలంలో మంత్రి పర్యటన

By

Published : Mar 31, 2021, 7:54 PM IST

మునుపటిలా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే ధాన్యం కొంటుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. రైతుల నుంచి ఎఫ్​సీఐ 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు.

చెత్త సేకరణకు గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, నీటి ట్యాంకర్ ఏర్పాటు చేసి పల్లెలు పరిశుభ్రంగా ఉండేలా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ప్రతి నీటి బొట్టు ఒడిసి పట్టాలనే లక్ష్యంతో కప్పలవాగు, పెద్ద వాగులపై చెక్ డ్యామ్​ల నిర్మాణం చేపట్టినట్టు మంత్రి వెల్లడించారు. వీటి ద్వారా సుమారు 40 వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. మొత్తం 22 చెక్​డ్యామ్​ల్లో 10 పూర్తి కాగా... మిగిలిన వాటి పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మండుతున్న ఎండలు

ABOUT THE AUTHOR

...view details