తెలంగాణ

telangana

ETV Bharat / state

'జీతాల్లో కోతల వల్ల... ఇల్లు గడవడం కష్టమైంది' - Employees protest for salary cutting in bhodhan

నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన చేపట్టారు. జీతాల్లో కోత విధించటాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు. పూర్తి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Employees protest for salary cutting in bhodhan
Employees protest for salary cutting in bhodhan

By

Published : Jun 1, 2020, 8:07 PM IST

లాక్​డౌన్ వేళ జీతాలలో కోతను నిరసిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కోత విధించిన జీతాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జీతాల్లో కోతల వల్ల ఈఎమ్ఐలు చెల్లించగా... మిగిలిన డబ్బుతో ఇల్లు గడవడం కష్టంగా మారిందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి జీతాలు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details