తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా బారిన పడి ఎడపల్లి వాసి మృతి - Edapalli resident died due to corona

తెలంగాణలో రెండో దశలో కరోనా వ్యాప్తి అధికమవుతోంది. రోజురోజుకీ కేసులు పెరుగుతున్నాయి. వైరస్ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మహమ్మారి సోకి మృతిచెందాడు.

corona infection
కరోనా

By

Published : Apr 11, 2021, 10:39 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో కరోనా కోరలు చాస్తోంది. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్ సోకింది. బాధితుడు హైదరాబాద్​లోని ఓ ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.

మృతుడు బోధన్ ఆర్టీసీ డిపోలో కండక్టర్​గా విధులు నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతూ మరణించాడు.

ఇదీ చూడండి:బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి... లేదంటే రూ. వెయ్యి ఫైన్

ABOUT THE AUTHOR

...view details