తెలంగాణ

telangana

Response : 'చిన్నప్రాణం.. పెద్దగండం' కథనానికి స్పందన.. ఆపరేషన్ సక్సెస్..!

By

Published : Apr 13, 2023, 4:58 PM IST

Response to ETV Bharat Story : చిన్న ప్రాణం.. పెద్దగండం.. మా బిడ్డను బతికించండి సారూ.. శీర్షికతో ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి స్పందన లభించింది. వయసుకు మించి పెరిగిన తలతో బాలుడి అవస్థలపై ఈ నెల 3న కథనం రాగా.. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ప్రతిమారాజ్ స్పందించారు. బాబుకు ఆపరేషన్‌ జరిగేలా చొరవ చూపారు.

Nizamabad district
Nizamabad district

Response to ETV Bharat Story : చిన్న ప్రాణం.. పెద్దగండం.. మా బిడ్డను బతికించండి సారూ శీర్షికతో ఈటీవీ భారత్‌లో వచ్చిన కథనానికి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ప్రతిమారాజ్ స్పందించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం రాంపూర్‌నకు చెందిన శ్రీకాంత్, హారిక దంపతుల కుమారుడు శివకుమార్‍ 5 నెలల వయసు నుంచి హైడ్రో సెఫలస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఉన్న ఆస్తులు అమ్ముకుని వైద్యం చేయించినా ఫలితం లేదు. దీంతో ఏప్రిల్ 3న తన కుమారుడితో కలిసి తల్లి ప్రజావాణికి వచ్చింది. తన కుమారుడిని బతికించాలంటూ అధికారులను వేడుకుంది.

వయసుకు మించి పెరిగిన తలతో బాలుడి అవస్థపై ఈ నెల 3న ఈటీవీ భారత్‌లో కథనం వచ్చింది. ఈ కథనానికి స్పందించిన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్.. ప్రత్యేక చొరవతో నాలుగు రోజులు వైద్యం అందించారు. అనంతరం హైదరాబాద్​లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. అక్కడి వైద్యులతో మాట్లాడి సరైన వైద్యం అందేలా చూశారు. శివకుమార్‌కు ఈ నెల 8న మొదటి దశ శస్త్ర చికిత్స చేయగా విజయవంతమైంది.

అసలేం జరిగిదంటే: శ్రీకాంత్‌, హారిక దంపతులకు 8 సంవత్సరాల క్రితం కవల పిల్లలు జన్మించారు. ఆ ఇద్దరు మగపిల్లలను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. కానీ వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కవలల్లో ఒక బాబు పుట్టిన వెంటనే మరణించాడు. మరో బిడ్డకు శివకుమార్‌ అని పేరు పెట్టారు. కొంతకాలం బాబు అందరిలాగే ఉన్నప్పటికీ.. 5 నెలల వయసు నిండిన తర్వాత బాబు నెత్తిన అనారోగ్యం పిడుగులా పడింది.

మొదట్లో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. శివకుమార్‌ను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు తగ్గిపోతుందని చెప్పినా.. వయసుతో పాటే వ్యాధి పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే తల పెద్దగా మారిపోయింది. స్థానికంగా ఎన్ని ఆసుపత్రులకు తిప్పినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలోనే నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి బాబును తీసుకువెళ్లారు. చేసిన కష్టం, ఒంటిమీద ఉన్న బంగారం, మరింత అప్పుచేసి ఆసుపత్రిలో చూపించారు.

ఈ సమయంలోనే పరీక్షలు జరిపిన వైద్యులు.. బాబు హైడ్రో సెఫలస్‌ అనే వ్యాధి బారిన పడినట్లు గుర్తించారు. ప్రైవేటు ఆసుపత్రిలో అప్పటికే రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. ఆ నిరుపేద దంపతులకు శివకుమార్‌ ఆరోగ్యం తలకు మించిన భారంగా మారింది. దీంతో హైదరాబాద్‌లోని గాంధీ, నిలోఫర్‌ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. హైడ్రో సెపలస్‌కు సంబంధించి అక్కడ చికిత్స సదుపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలని వారు చెప్పారు. దీంతో చేసేదేమీ లేక శ్రీకాంత్‌, హారిక దంపతులు స్వగ్రామానికి వెళ్లిపోయారు. ఇటీవల ప్రజావాణిలో తమ గోడును వెళ్లబోసుకోగా.. తాజాగా డాక్టర్ ప్రతిమరాజ్ స్పందించి అండగా నిలిచారు.

ఇవీ చదవండి:చిన్నప్రాణం పెద్దగండం మా బిడ్డను బతికించండి సారూ

జూపల్లి, పొంగులేటి.. 'చేతి'కి చిక్కుతారా? కమలం గూటికి చేరుతారా?

'ఆ కంపెనీల్లో 40లక్షల ఉద్యోగాలు'.. 71వేల మందికి మోదీ అపాయింట్​మెంట్ లెటర్స్

ABOUT THE AUTHOR

...view details