తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతి పేదవాడి కల.. రెండు పడక గదుల ఇల్లు - రెండు పడక గదుల ఇళ్లు పథకం

పేదవాళ్లు గౌరవంగా బతికే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం చేపట్టారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు.

డబుల్​ భెడ్​రూం ఇళ్లు ప్రారంభం

By

Published : Oct 25, 2019, 3:13 PM IST

డబుల్​ భెడ్​రూం ఇళ్లు ప్రారంభం

ప్రతి పేదవాడికి సొంతింటి కలను ముఖ్యమంత్రి కేసీఆర్​ నెరవేరుస్తున్నారని రోడ్లు,భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు. నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి మండలం బీబీపూర్​లో నూతనంగా నిర్మించిన 50 రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. కాళేశ్వరం 21వ ప్యాకేజీ పనులు జరుగుతున్నాయని, పైపులైన్​ పనులు జరిగే క్రమంలో రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. చెప్పుడు మాటలు వినకుండా సాగునీటి పైప్​లైన్​ పనులకు సహకరించాలని రైతులను కోరారు.

ABOUT THE AUTHOR

...view details