తెలంగాణ

telangana

ETV Bharat / state

లోపభూయిష్టంగా నిజామాబాద్​లోని డబుల్​బెడ్​ రూమ్​ ఇళ్లు

నిజామాబాద్​ నగరంలో మూడేళ్లుగా నిర్మించ తలపెట్టిన డబుల్​ బెడ్​ రూం ఇళ్లు ఇంత వరకు శంకుస్థాపన కూడా కాలేదని జిల్లా కార్యదర్శి రమేశ్​బాబు ఆరోపించారు. దుబ్బ, బైపాస్ రోడ్​, కలెక్టరేట్ వద్ద నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇండ్లను సీపీఎం జిల్లా ప్రతినిధులు పరిశీలించారు.

double bedroom houses visit by cpm leaders in nizamabad district
లోపభూయిష్టంగా నిజామాబాద్​లోని డబుల్​బెడ్​ రూమ్​ ఇళ్లు

By

Published : Nov 10, 2020, 12:34 PM IST

నిజామాబాద్ నగరంలోని దుబ్బ, బైపాస్ రోడ్​, కలెక్టరేట్ వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్​రూమ్ ఇళ్లను సీపీఎం జిల్లా ప్రతినిధుల బృందం పరిశీలించింది. గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభించినప్పటికీ ఇంతవరకు ఇంకా పునాది కూడా వేయనివి అనేకం ఉన్నాయని ఆరోపించారు. దుబ్బ, బైపాస్ రోడ్ ప్రాంతాల్లోని రెండు పడక గదుల ఇండ్లను చెరువు కుంటలో నిర్మించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. నాణ్యమైన ఇసుక, కంకర, సిమెంటు, వాడకపోవడం వల్ల నిర్మాణాలు లోపభూయిష్టంగా ఉన్నాయన్నారు.

గృహ నిర్మాణ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే 10397 ఇండ్లను.. నిర్మాణానికి మంజూరు చేయగా ఇప్పటివరకు కేవలం 791 ఇళ్లనే పూర్తిచేశారని.. అందులో 395 ఇళ్లను మాత్రమే పేదలకు పంపిణీ చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్​బాబు ఆరోపించారు.

ఇదీ చూడండి:చిన్న పరిశ్రమలకు కొత్తతరం సాంకేతిక పరిజ్ఞానం..

ABOUT THE AUTHOR

...view details