తెలంగాణ

telangana

ETV Bharat / state

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే కేటాయించాలి : మల్యాల గోవర్ధన్ - డబుల్ బెడ్ రూం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను సీపీఎం నగర కమిటీ సందర్శించింది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలో ఏ ఒక్కరికీ గత ఆరేళ్ల కాలంలో రెండు పడకల ఇళ్లను పంపిణీ చేయకపోవడం సిగ్గుచేటని సీపీఎం నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ తెలిపారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే కేటాయించాలి : మల్యాల గోవర్ధన్
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే కేటాయించాలి : మల్యాల గోవర్ధన్

By

Published : Sep 5, 2020, 11:05 PM IST

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం నివాసాలను లబ్ధిదారులకు కేటాయించాలని సీపీఎం నగర కమిటీ డిమాండ్ చేసింది.

ప్రజాధనం వృథా..

నాగారం ప్రాంతంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించిన్నప్పటికీ... పంపిణీ చేయకపోవడం వల్ల కిటికీ అద్దాలు పగిలిపోయి, ఫర్నీచర్ ధ్వంసం అయ్యిందని సీపీఎం నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ తెలిపారు. ఫలితంగా ప్రజాధనం వృథాగా పోతున్నా కాంట్రాక్టర్లకు మాత్రం కాసుల వర్షం కురిసిందన్నారు.

అందని ద్రాక్ష..

అయినప్పటికీ డబుల్ బెడ్ రూం నివాసాల పంపిణీ మాత్రం నగర ప్రజలకు అందని ద్రాక్షలా మారిందన్నారు. నూతన నివాస సమూదాయాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారకముందే నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నగర కమిటీ సభ్యులు బెజుగం సుజాత, బొప్పిడి అనసూజ, నల్వాల నర్సయ్య, ద్యారంగుల కృష్ణ, నాయకులు కఠారి రాములు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ద్వారా వైద్యం అందించాలి: టీఎన్జీవో

ABOUT THE AUTHOR

...view details