నిజామాబాద్ నగరంలోని బోయిగల్లీలో గత కొంత కాలంగా ఓ కుక్క కాలనీకి కాపలాగా ఉంటోంది. కొత్తవారు ఎవరువచ్చినా మొరుగుతూ కాలనీ వాసులను అప్రమత్తం చేసేది. ఒంటరిగా వెళ్లే మహిళలకు తోడుగా వెళ్లేది. మార్కెట్కు వెళ్లి ఇంటికి చేరే వరకు వాళ్లను అనుసరిస్తూ వెంట నడిచేది. నమ్మకంగా ఉండటంతో కాలనీవాసులు ఆహారం పెట్టి ఆకలి తీర్చేవారు. అయితే ఆ కుక్క రోడ్డు ప్రమాదంలో మరణించింది. కాలనీ వాసులు ఘనంగా కుక్కకు అంత్యక్రియలు జరిపించారు. సంప్రదాయ బద్ధంగా ఖననం చేశారు.
శునకానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు... - Nizamabad district
అప్పటి వరకు తమతో పాటు కాలనీలో విశ్వాసంగా ఉన్న శునకం ఒక్కసారిగా రోడ్డు ప్రమాదంలో మరణించటం వల్ల కాలనీవాసులు కన్నీరుమున్నీరయ్యారు. శునకనికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. తమతో ఎంతో విశ్వాసంగా ఉండేదని కుక్క కాపలాతో దొంగల భయం కూడా ఉండేది కాదని స్థానికులు కుక్కతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
![శునకానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4128093-924-4128093-1565716478160.jpg)
శునకానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు...
Last Updated : Aug 13, 2019, 11:31 PM IST