పొద్దంతా ఎంత పనిచేసినా సాయంత్రం వేళ గొంతులో కల్లు చుక్క పడితే గానీ కంటిమీదకి కునుకురాదు కొందరికి. ఒక్క పూట కల్లు దొరక్కపోయినా విలవిల్లాడిపోతారు. రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కల్లు దుకాణాలు మూతపడ్డాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్లు దొరక్క పలువురు ప్రాణాలు కోల్పోయారు. అసలు ఈ పరిస్థితి ఎందుకొస్తుంది. దీనిని నివారించలేమా... తదితర సమస్యకు పరిష్కారం ఉందంటున్న జిల్లా ఆస్పత్రి మానసిక వైద్యుడు డా. విశాల్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
కల్లు తాగకపోతే మరణిస్తారా? ఇలా చేస్తే బయటపడొచ్చు - కల్లు తాగకుండా ఎలా ఉండొచ్చో చెబుతున్న వైద్యులు
లాక్డౌన్ కారణంగా కల్లు దుకాణాలు మూతపడ్డాయి. రోజువారీ కూలీలతో పాటు ఇతర పనులు చేసుకుంటూ నిత్యం కల్లు సేవించేవారికి ఇబ్బందిగా మారింది. కల్లు తాగక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి వచ్చిందటే.. అసలు ఆ కల్లులో ఏముంటుంది. ఎందుకిలా జరుగుతోంది వంటి కారణాలను తెలుసుకోవాల్సిందే.
![కల్లు తాగకపోతే మరణిస్తారా? ఇలా చేస్తే బయటపడొచ్చు how to avoid palm tree drink consumption](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6580135-thumbnail-3x2-kallu-rk.jpg)
కల్లు తాగకపోతే మరణిస్తారా? ఇలా చేస్తే బయటపడొచ్చు
Last Updated : Mar 29, 2020, 7:09 AM IST