'బ్లాక్ ఫంగస్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. ముప్పు తక్కువ'
బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రముఖ దంత వైద్యుడు డాక్టర్ ప్రతాప్ కుమార్ సూచించారు. ప్రాథమిక దశలోనే చికిత్స పొందితే ప్రాణాపాయం తప్పుతుందని తెలిపారు.
దంతాల్లో సమస్య అనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించడం ద్వారా ప్రాథమిక దశలోనే బ్లాక్ ఫంగస్‌ను గుర్తించవచ్చని ప్రముఖ దంత వైద్యుడు డాక్టర్ ప్రతాప్ కుమార్ తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే మెదడుకు వ్యాపించే అవకాశముందని వెల్లడించారు. పంటి నొప్పి, చిగుళ్లలో చీము, రక్తం రావడం, చిగుళ్లు వాపు, ముక్కు నుంచి నల్లటి ద్రావణం రావండ, కళ్ల నుంచి నీరు కారడం వంటివి బ్లాక్ ఫంగస్ లక్షణాలని చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో అప్రమత్తంగా ఉంటేనే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు అని చెబుతున్న డాక్టర్ ప్రతాప్ కుమార్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
- ఇదీ చదవండి :మధ్యప్రదేశ్‌లో తొలి వైట్ ఫంగస్ కేసు