తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇదేందయ్యా ఇది.. ఓఎంఆర్‌ పత్రాన్నే మింగేశాడు! - TSPSC

Candidate Who Swallowed OMR Seat In Examination Conducted By TSPSC: డివిజనల్​ అకౌంట్స్​ ఆఫీసర్​ రాత పరీక్షలో ఓ అభ్యర్థి ఓఎంఆర్​ పత్రాన్ని మింగాడు. గైర్హాజరైన అభ్యర్థి దొంగలించి పరీక్షను రాశాడు. ఈ సంఘటన నిజామాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది.

mall practice
మాల్​ ప్రాక్టీస్​

By

Published : Feb 27, 2023, 9:18 AM IST

Candidate Who Has Swallowed OMR Seat In Nizamabad: టీఎస్​పీఎస్సీ నిర్వహించిన డివిజనల్​ అకౌంట్స్​ ఆఫీసర్​ రాత పరీక్షలో ఓ అభ్యర్థి ఓఎంఆర్​ షీట్​ను మింగి మాల్​ ప్రాక్టీస్​కు పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని బోర్గాం(పీ) లోని ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో జరిగింది. ఈ విషయంపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్​ జిల్లాకు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి అబ్దుల్​ ముఖీద్​.. డివిజనల్​ అకౌంట్స్​ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్​ అభ్యర్థులకు ఓఎంఆర్​ షీట్​లను అందజేశారు. పరీక్షకు హాజరుకాని అభ్యర్థులకు కేటాయించిన స్థానాల్లో సైతం పత్రాలను ఉంచారు. అప్పటికే పరీక్ష రాస్తున్న ముఖీద్​ తనకు ఇచ్చిన ప్రశ్నలలో చాలా వరకు తప్పులు రాయడంతో.. గైర్హాజరైన అభ్యర్థి ఓఎంఆర్​ పత్రాన్ని ఇన్విజిలేటర్​కు తెలియకుండా దొంగలించాడు. దొంగలించిన ఓఎంఆర్​ పత్రంతో మళ్లీ పరీక్షను రాశాడు.

ఇప్పుడు తన ఓఎంఆర్​ షీట్​ను ఎవరికీ తెలియకుండా అక్కడే ముక్కలు చేసి.. నమిలి మింగేశాడు. పరీక్ష సమయం అయిపోవడంతో ఇన్విజిలేటర్​లు పరీక్ష పత్రాలను తీసుకునే క్రమంలో ఒక ఓఎంఆర్​ షీట్​ కనిపించట్లేదని గుర్తించారు. వెంటనే ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఎగ్జామ్​ హాల్​లోని సీసీ కెమెరాలో రికార్డు అయిన పుటేజినీ పరిశీలించారు.

Candidate Stole OMR Seat In Divisional Accounts Officer Exam: దీంతో అధికారులకు విస్తుపోయే నిజం తెలిసింది. పరీక్షకు హాజరైన అబ్దుల్​ ముఖీద్​.. గైర్హాజరైన అభ్యర్థి ఓఎంఆర్​ షీటును దొంగిలించి.. అందులో సమాధానాలు నింపాడు. తన పత్రాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మింగేశాడని అధికారులు గుర్తించారు. టీఎస్​పీఎస్సీ తప్పుడు సమాధానాలకు నెగెటివ్​ మార్కులను పెట్టింది. ఆ భయంతోనే తప్పుగా రాసిన తన ఓఎంఆర్​ షీట్​ను చింపి.. రాని అభ్యర్థి ఓఎంఆర్​ పత్రంలో పరీక్ష రాసి ఉంటాడని అధికారులు భావించారు.

వెంటనే అక్కడ ఉన్న అధికారులు నాలుగో పట్టణ పోలీస్​ స్టేషన్​కు సమాచారం అందించారు. అబ్దుల్​ ముఖీద్​ను అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే ఓఎంఆర్​ షీట్​ను మింగినట్లు ఒప్పుకున్నాడు. ముఖీద్​పై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

డివిజనల్​ అకౌంట్స్​ ఆఫీసర్స్​ పరీక్షకు 63శాతం అభ్యర్థులు హాజరు: ఆదివారం టీఎస్​పీఎస్సీ నిర్వహించిన డివిజనల్​ అకౌంట్స్​ ఆఫీసర్స్​ గ్రేడ్​-2 పోస్టుల భర్తీకి జరిగిన రాత పరీక్షలో 63శాతం మంది హాజరయ్యారు. ఈ పరీక్షకు 1,06,253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా.. ఆదివారం ఉదయం పేపర్​-1 పరీక్షకు 67,830 మంది, మధ్యాహ్నం పేపర్​-2కు 66,903 మంది హాజరయ్యారని టీఎస్​పీఎస్సీ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 241 పరీక్షాకేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని టీఎస్​పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్​ పేర్కొన్నారు. రెండు మాల్​ ప్రాక్టీస్​ కేసులు నమోదయ్యాయని ప్రకటించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details