నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని ప్రధాన రహదారిపై ఉన్న ఎస్బీఐ బ్యాంకులో గత అర్ధరాత్రి చోరీ యత్నం జరిగింది. బ్యాంకు కిటికీలు పగలగొట్టి లోనికి చొరబడిన దుండగులు... లాకర్‌ను పగలగొట్టేందుకు విఫలయత్నం చేశారు. సైరన్ మోగడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఫోన్ ద్యారా అప్రమత్తమైన బ్యాంకు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకులో ఎటువంటి దోపిడీ జరగలేదని వెల్లడించారు.
'డిచ్పల్లి ఎస్బీఐ బ్యాంకులో చోరీకి యత్నం' - నిజామాబాద్ జిల్లా
నిజామాబాద్ జిల్లాలోని ఓ ఎస్బీఐ బ్యాంకులో గత అర్ధరాత్రి చోరీ యత్నం జరిగింది. సైరన్ మోగడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.
'డిచ్పల్లి ఎస్బీఐ బ్యాంకులో చోరీకి యత్నం'